నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు భూమి పూజ శుక్రవారం నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ నుండి 35 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని ఆ నిధులతో కళాశాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం సిసి రోడ్ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, వై శ్రీ, అశోక్ మైపాల్, గోపి, నజీర్, నీరజ్ ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.