సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ ..

Bhumi Puja for construction of CC road..నవతెలంగాణ – కుబీర్
మండలంలోని కస్ర గ్రామంలో శుక్రవారం రెండు లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బషీర్ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి వడ లో సీసీ రోడ్డు మరియు మురికి కాలువలు నిర్మించేందుకు ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ కృషి తో మండలాన్ని మరింత అభివృది పరిచ్చేలా కృషి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం వల్ల అనేక గ్రామంలో ఎలాంటి అభివృది పరిచకపోవడం తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకావడం జరిగింది. దింతో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలు ప్రవేశపెట్టి ప్రజల వద్ద నుంచి ధరకస్తులు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దింతో మరి కొద్దీ రోజులో రేషన్ కార్డులు మంజూరు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నిధులు మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో బంక బాబు, వివేకానంద,శివాజీ, తిరుపతి,మోహన్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.