సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని 10వ వార్డులో ఎస్సీ ఎస్టీ, నిధుల ద్వారా నిర్మిస్తున్న సిసి రోడ్డు కు శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్  ఐలేని అనిత, కౌన్సిలర్లు గోవిందు రవి,  కొంకటి నళిని దేవి, బొజ్జ సతీష్, మేదర బోయిన వేణు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న,కమిషనర్ ఎం రాజ్ కుమార్ , సాయి ప్రణీత్, దయ్యాల రవికుమార్  తదితరులు పాల్గొన్నారు.