సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని  హాసకొత్తూర్  గ్రామంలో సోమవారం సీసీ రోడ్డు పనులకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, మండల విద్యాధికారి ఆంధ్రయ్య,  ఎంపీటీసీ సభ్యురాలు నోముల రజిత నరేందర్ భూమిపూజ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూ. 5లక్షల నిధులతో గ్రామంలోని  గంగమ్మ గుడి  వద్ద  సీసీ రోడ్డు పనులను వారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించి గ్రామంలో మిగిలి ఉన్న అభివృద్ధి పనుల్ని పూర్తి చేస్తామన్నారు. సిసి  రోడ్డు నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి  చేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు  గ్రామం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి  నర్సయ్య,  జిల్లా కిసాన్ కేత్ ఉపాధ్యక్షుడు పడిగేలా ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్, నాయకులు పాలేపు నర్సయ్య, గోపీడీ లింగారెడ్డి, సంతోష్, కుందేటి శ్రీను, భుచ్చి మల్లయ్య, ప్రదీప్, మహేందర్, రాజేశ్వర్, గంగారెడ్డి, క్రాంతి, ,శ్రీకాంత్, రవి, శ్రీధర్, సృజన్, మనోహర్, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.