
మండలంలోని కోనాపూర్ లో శ్రీ మార్కండేయ పద్మశాలి కుల సంఘ భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పద్మశాలి సంఘ భవనానికి రూ.4 లక్షలు మంజూరు చేశారు. అట్టి నిధులతో చేపడుతున్న భవన నిర్మాణానికి జడ్పిటిసి సభ్యురాలు పెరుమాండ్ల రాధా రాజా గౌడ్, సర్పంచ్ దయ్య దేవయ్య చేతుల మీదుగా మార్కండేయ పూజా కార్యక్రమాలు నిర్వహించి, భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ సభ్యులు మాట్లాడుతూ… కుల బాంధవులు సమావేశం నిర్వహించుకోవడానికి సంఘ భవనం అవసరమని, నిధులు మంజూరు చేయాలని కోరిన వెంటనే నిధులు మంజూరు చేసి సహకరించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి సంఘ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బడాల రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ జలంధర్, ఎంపీటీసీ సభ్యుడు గూగులోతు గంగాధర్, గ్రామ కమిటీ సభ్యులు, పద్మశాలి సంఘం అధ్యక్షులు గంగుల లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షుడు చిలివేరి లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ, సత్యనారాయణ, నరేష్, శ్రీనివాస్, దేవదాస్, భూమయ్య, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.