నవతెలంగాణ – మోర్తాడ్
మండలం షట్పల్లి గ్రామంలో సోమవారం సాహసార్జున పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పి ఎస్ ఎస్ ఎం నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి సిద్దేశ్వర పిరమిడ్ చైర్మన్ శ్రీ తిరుమల గంగ రామ్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. శెట్టిపల్లి గ్రామంలోని శ్రీ పద్మ శ్రీనివాస్ దంపతుల ఇంటి వద్ద తమ కుమారుడు మిదిన్ చక్రవర్త సహజ హితం కోసం చక్కని జ్ఞాన మందిరాన్ని నిర్మించడానికి కృషి చేయడంతో ఈ జాన మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గార్ల మార్గదర్శకం తో ఈ ధ్యాన మందిర నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పద్మ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నల్ల గంగారెడ్డి, అమరావతి శ్రీనివాస్, పెంబర్తి నారాయణ, మంచిర్యాల్ రాజేశ్వర్ రడ్డి అమృత రావు తదితరులు పాల్గొన్నారు.