నవతెలంగాణ- తొగుట: ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటీగడ్డ కిష్టాపూర్ గ్రామం లో గ్రామ దేవతల ఆలయాలు నిర్మాణం కోసం భూమి పూజ చేశామని సర్పంచ్ దామ రంచ ప్రతాప్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లా డుతూ మల్ల న్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఏటీ గడ్డ కిష్టాపూర్ గ్రామం ముంపునకు గురైన తెలిసిందే అన్నారు. 3 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజలను ఆర్ అండ్ ఆర్ కాలనీ, గజ్వేల్ డబుల్ బెడ్ రూమ్ లలోకి చేరుకు న్నాం. అప్పటి నుండి గ్రామ ప్రజలు నూతన గృహ ప్రవేశాలు, యువతి, యువకుల వివాహాలు చేశారు. కానీ గ్రామ దేవతల ఆలయాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. గ్రామ ప్రజల సమక్షంలో గ్రామానికి అందుబాటులో గ్రామ దేవతల ఆలయాలు నిర్మా ణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు వస్తా మన్నారు. అందుకోసం భూమి పూజ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదిత రులు పాల్గొన్నారు.