రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ

నవతెలంగాణ – చిన్నకోడూరు
మండలంలోని వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపడతామని చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్య రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామంలో బిటి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంత్రి హరీష్ రావు సహకారంతో బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. బీటీ రోడ్ల నిర్మాణంతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పోతాయని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ శ్రీహరి యాదవ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంటయ్య, సర్పంచ్లు పద్మ గోవింద గిరి స్వామి యాదవ్, ఐలయ్య యాదవ్, ఎంపీటీసీ పద్మ మల్లేశం గౌడ్, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.