ఓపెన్ జిమ్ ఏర్పాటుకు భూమి పూజ 

Bhumi Pooja for setting up an open gymనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి, మాలపల్లి, పొట్లపల్లి, వంగరామయ్యపల్లి గ్రామాలలో ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం సోమవారం కాంగ్రెస్ పార్టీ టిపిసిసి మెంబర్ కేడo లింగమూర్తి ,హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క గ్రామానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం రూ 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనైనదన్నారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెన్నరాజు, హనుమాన్ల శ్రీకాంత్ రెడ్డి ,రమేష్ నాయక్, కల్లపల్లి వెంకటస్వామి, కర్ర రవీందర్ రెడ్డి, బత్తుల మల్లికార్జున్, పంపరి సంపత్ పోలు నర్సయ్య, చేతవేణి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.