ప్రహరి గోడ నిర్మాణానికి భూమి పూజ

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కంచర్ల గ్రామంలో గురువారం సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి గౌడ సంఘం భవన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో ప్రహరీ గోడ నిర్మాణానికి 4 లక్ష రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యుల తరఫున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సంఘం సభ్యులు సిద్ధ గౌడ్, బిక్షపతి, సత్యా గౌడ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.