పల్లె దవాఖానకి భూమి పూజ..

Bhumi Pooja for rural hospital..– స్వచ్ఛధనం పచ్చదనం పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని పాఠశాల విద్యార్థులతో గ్రామస్తులతో అధికారులతో కలిసి ర్యాలీగా వెళ్లి మొక్కలను నాటారు.. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పల్లె దవాఖానకి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని నేడు ప్రారంభించుకోవడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ప్రజలు ఆరోగ్య బారిన పడకుండా ఉంటారు.గతంలో వనమహోత్సవం లో కూడా చెట్లను పెంపొందించుకునే కార్యక్రమాన్ని చేపట్టాం అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ చెట్లను నాటుతూ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అన్నారు.గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.ఫీడర్ ఛానల్ కు సంబంధించి ఇబ్బందులు ఉందన్నారు, అధికారులతో మాట్లాడడం జరిగింది త్వరలోనే ఇబ్బందులను పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుగ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నాం అని వెల్లడించారు.గత ప్రభుత్వం  పావలా రుణమాఫీ చేశారు, నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ చేశాం అని అన్నారు.రైతులు ఏది అడిగిన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది,రాజన్న ఆలయానికి 50 కోట్ల నిధులు కేటాయించాం అని తెలిపారు.గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో రాజన్న ఆలయానికి అనా పైసా కూడా  కేటాయించలేదని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. గత ప్రభుత్వ హయాంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జోకుడు ఎలా ఉండేదో ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో జోకుడు ఏ విధంగా ఉందో రైతాంగం గమనిస్తున్నారని అన్నారు.వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 7 వ తేదీన వేములవాడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, 8వ తేదీన చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీనికి అర్హులైన వారి ఎంపికకు క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.అర్హులైన దివ్యాంగులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించనున్న క్యాంపులకు హాజరై ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు. కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.