
మండలంలోని గంగారమంద గ్రామంలోని మహిళ భవనానికి స్థానిక సర్పంచ్ ఆనుగు గంగాధర్ భూమి పూజ సోమవారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ భవనానికి రూ. 5 లక్షలతో భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఈ నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, ఎంపిపి మస్తా ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులు సరిపోవని చేపడంతో మళ్ళీ రూ. 5 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు.