
నవతెలంగాణ-పెద్దవంగర: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నేడు తలపెట్టిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటు భూమి పూజ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. సామాన్యుల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటుగా పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ ఎంతో కృషి చేశాడని కొనియాడారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని నేడు పాలకుర్తిలో చేపట్టే విగ్రహ ఏర్పాటు భూమి పూజకు కార్యకర్తలు తరలిరావాలని కోరారు.