ఈనెల 5న 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ

నవతెలంగాణ – తుంగతుర్తి
తుంగతుర్తి మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 100 పడకల ఆసుపత్రికి ఈనెల 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే భూమి పూజ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.45 కోట్లకు పైగా నిధులతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ ఏర్పాట్లు చేయడంతో పాటు నిధులు కూడా విడుదలయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు హాజరవుతున్నట్లు తెలిపారు.వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు అయితే ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుతాయని అన్నారు.