మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో యాదవ,గౌడ సంఘాల అదనపు గది నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధులు రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు సోమ దేవరెడ్డి,బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేం గంగాప్రసాద్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దిబ్బ శ్రీనివాస్ లు మాట్లాడుతూ…గ్రామాభివృద్ధిలో భాగంగా గౌడ సంఘం అదనపు గది నిర్మాణానికి 5 లక్షలు,యాదవ సంఘానికి 5 లక్షల రూపాయల నిధులు రావడం ఆనందంగా ఉందని, గ్రామాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నాయకులందరం కలిసి పనిచేస్తామని అన్నారు.నిధుల మంజూరుకు చొరవ చూపిన ముత్యాల సునీల్ రెడ్డికి సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామగౌడ్, నూకల అశోక్, బెజ్జారం భాను, క్యాతం నవీన్, ఆవుల దేవన్న, గురువయ్య, బెజ్జారం శ్రీను, ప్రశాంత్ యాదవ్, ప్రభాకర్, సుదర్శన్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.