మండలంలోని తడపాకల్ గ్రామంలో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ (ఎస్.డీ.ఎఫ్ )నిధుల ద్వారా మంజూరైన పనులకు మంగళవారం భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రేస్ నాయకులు జింక అనిల్ మాట్లాడుతూ… బాల్కొండ కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చొరవతో ఎస్.డీ.ఎఫ్ నిధులు గ్రామానికి మంజూరు కావడం జరిగిందని అన్నారు.ఇందులో భాగంగా మాదిగ సంఘ ప్రహరీ గోడ నిర్మాణానికి 2 లక్షల 50 వేలు,విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రహరీ గోడ నిర్మాణానికి 2 లక్షల 50 వేలు,పాత హనుమాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి 1 లక్ష 50 వేలు మొత్తం 6 లక్షల 50 వేల రూపాయలు మంజూరు కావడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా ఈ సందర్భంగా కుల సంఘాల సభ్యులు సునీల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.