– మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బుధవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమి పూజ చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో ఇప్పటికే సీఎం చూసిన ప్రదేశంలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.