మండలంలోని దోంచంద గ్రామానికి చెందిన గోనెరెడ్డి కాపు సంఘం అదనపు గది నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ,మాదిగ సంఘం అదనపు గది నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఎస్డీఎఫ్ ద్వారా నిధులు రావడంతో సోమవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘాల సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… ఎస్డీఎఫ్ నిధుల మంజూరుకు కృషిచేసిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివ కుమార్, కమ్మర్ పెళ్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొరిపెల్లి లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ రవి రెడ్డి, నాయకులు ఆశిరెడ్డి హన్మంత్ రెడ్డి, చిన్నోళ్ళ లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.