ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి

Bhupal Reddy, Additional Collector of Rangareddy District, caught up with ACB

నవతెలంగాణ – పెద్ద అంబర్ పేట్

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి నుంచి 8 లక్షల లంచం తీసుకుంటుండగా ఓఆర్ఆర్ పరిధిలో ఏసీబీ అధికారులకు చిక్కారు. ధరణిలో పనులు చేసేందుకు  మధ్యవర్తుల తో ఒప్పందం చేసుకున్న భూపాల్ రెడ్డి ఒప్పందం ప్రకారం ఎనిమిది లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాత్రి నుంచి కార్యాలయంలోనే భూపాల్ రెడ్డి విచారిస్తున్నారు. భూపాల్ రెడ్డి తో పాటు మదన్మోహన్  మరో అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా భూపాల్ రెడ్డి పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ తట్టి అన్నారం ఇందు అరణ్య 156 జిల్లాలో నివాసం ఉంటున్న భూపాల్ రెడ్డి ఇంట్లో సైతం రాత్రి నుంచి సోదాలు చేస్తున్నారు కుటుంబ సభ్యులను బయటకు వెళ్లకుండా విచారణ చేపట్టినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో నగదు తో పాటు పత్రాలు లభిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ దాడులలో ఏసీబీ సిటీ రేంజ్ 1 డిఎస్పి శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్లు జానకిరామ్ రెడ్డి,నరేష్ ఇతర బృందం ఈ దాడులు పాల్గొన్నట్లు సమాచారం పూర్తి వివరాలను తొందరలో మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు.