విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపల్ అభివద్ధికి కేటీఆర్ సహకారంతో రూ.30 కోట్ల నిధులు మంజూరు అయ్యా యని అభివద్ధి పథంలో భూపాలపల్లి దూసుకుపోతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ అభివద్ధికి 30 కోట్ల నిధులు మంజూరైన సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఇటీవల భూపాలపల్లి మున్సిపాలిటీకి 50కోట్ల నిధులను మంజూరు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని, ఆమేరకు ముందుగా రూ.30కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రూ.5కోట్లతో భూపాలపల్లి అంబెడ్కర్ సెంటర్ నుంచి ఓసీ జుంక్షన్ వరకు బీటీ రోడ్డు,సైడ్ కాలువలు మరియు సెంటర్ లైటింగ్ పనులకు నిదులు కేటాయించారు. రూ.80లక్షలతో బాంబుల గడ్డ సింగరేణి ప్రధాన రహదారి నుంచి డంపింగ్ యార్డ్ వరకు అంతర్గత రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. రూ.1.50కోట్లతో భాస్కర గడ్డ ప్రధాన దారి నుంచి వేశాలపల్లి వరకు అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. రూ.1.75కోట్లతో సీసీ సైడ్ డ్రైన్ నిర్మాణం రామాలయం నుంచి కెటికె 5 ఇంక్లైన్ వరకు, అదేవిధంగా రూ.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం గాంధీ కాలేజీ నుంచి జంగెడు రోడ్డు వరకు, రూ.2 కోట్లతో కాశింపల్లి కట్టు కాలువ మీదుగా పెద్ద పోచమ్మ దేవాలయం వరకు బ్రిడ్జ్ తో కూడిన బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. రూ.4 కోట్లతో మినీ స్టేడియం బ్యాలెన్స్, ఆడిటోరియం పనులకు కేటాయించి పనులు పూర్తి చేయడం జరుగు తుందని అన్నారు. రూ. 4 కోట్లతో ఐవీఎన్‌ఎంసీ మిగిలిన పనులకి కేటాయించి, రూ.50 లక్షలతో బీసీ కాలనీసీసీ డ్రైన్ ల నిర్మాణం పనుల పూర్తి చేయాలని కోరారు. రూ.2.50 కోట్లతో మిగిలిన పిల్లోని పల్లి నుంచి కొంపల్లి వరకు రోడ్డు వెడల్పు,సెంటర్ లైటింగ్, సైడ్ డ్రైన్‌ల నిర్మాణ పనులకు కేటాయింపులు జరిగాయని వివరించారు.రూ.45 లక్షలతో మహబూబ్ పల్లి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.50 లక్షలతో పుల్లూరు రామయ్యపల్లి వార్డులో అంతర్గ త రోడ్డు నిర్మాణ పనులకు కేటాయింపు చేసి మొత్తం 30 కోట్లతో పట్టణాన్ని అన్ని విధాల అభివద్ధి చేయడం జరుగు తుందని తెలిపారు. ఈ 30 కోట్లకు కేటాయించిన అభివద్ధి పనులను వెంటనే జిల్లా కలెక్టర్ ద్వారా పిలిచి అభివద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య విద్యాసాగర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, కౌన్సిలర్లు బద్ది సమ్మయ్య, నూనె రాజు, జక్కం రవికుమార్, సజ్జనపు స్వామి, చల్ల రేణుక, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.