నవతెలంగాణ : గణపురం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల – భూపాలపల్లి జాతీయ రహదారి కేటిపిపి సమీపం కొంపల్లి క్రాస్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ వైపు నుండి భూపాలపల్లి వైపు వస్తున్న భూపాలపల్లి ఆర్డీవో మంగీలాల్ వాహనం ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వున్న పిల్లోనిపల్లికి చెందిన పర్శ సంపత్, కొంపల్లికి చెందిన సడాలా ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషంగా ఉంది. క్షతగాత్రులను భూపాలపల్లి జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గణపురం ఎస్సై సాంబమూర్తి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.