
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ర్యాలీ సందర్భంగా మంగళవారం భువనగిరిలో ప్రమాధవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉజ్జేర్ అహ్మద్ ను బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా హైదరాబాద్ పంజగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి వెల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని స్పెషల్ కేర్ తీసుకొని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.