నవతెలంగాణ – భువనగిరి : భువనగిరి నియోజకవర్గ బి.అర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి తన ఓటు హక్కును స్వగ్రామమైన కదిరెనిగూడెం గ్రామంలో ఆలేరు నియోజకవర్గం, ముటకొండూరు మండలంలో తన ఓటును వేశారు. కుంభం అనిల్ కుమార్ వలిగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన స్వగ్రామమైన వలిగొండలో తన ఓటును వినియోగించుకున్నారు. కొండమడుగు నరసింహ ముత్తిరెడ్డిగూడెంలో. సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహ భువనగిరి మండలం తన స్వగ్రామమైన ముత్తిరెడ్డిగూడెం లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య కొండమడుగు నాగమణి తో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. గూడూరు నారాయణరెడ్డి గూడూరులో బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి బీబీనగర్ మండలం స్వగ్రామమైన గూడూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.