
– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్
నవతెలంగాణ – తుర్కపల్లి
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ను ప్రజలు ఆదరించి భువనగిరి సీపీఐ(ఎం) పార్లమెంటు అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ఈ ఎన్నిక ధన బలం ప్రజాబలం మధ్య భువనగిరిలో పోటీ జరుగుతుందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ అన్నారు. మండలంలోని గోపాలపూర్ ,కొండాపూర్, తిరుమలాపూర్, గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను పార్లమెంటుకు పంపేందుకు గ్రామాలలో రైతులు కార్మికులు కర్షకులు ఒక్కటై ఆశీర్వదించాలని కోరారు. భువనగిరి గడ్డపైన సీపీఐ(ఎం) గెలిస్తే ప్రజల పక్షాన పార్లమెంటులో ప్రజా గొంతుకై కమ్యూనిస్టులు వినిపిస్తారని తెలిపారు. పది సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రైవేట్ పరం చేస్తూ దేశంలో ఎన్నడు లేని విధంగా నిరుద్యోగమును పెంచి పోషించిందని అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేసిన చరిత్ర ఎర్రజెండదని అన్నారు.భువనగిరి పార్లమెంటు పరిధిలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో ఒకపక్క ధన బలంతో వస్తున్న అభ్యర్థులకు, మరోపక్క ప్రజల బలంతో వస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థికి జరుగుతున్న యుద్ధంలో ఎగిరేది ఎర్రజెండా అనే అని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే పేద ప్రజలకు అండగా ఉండి పేద ప్రజల న్యాయం కోసం పోరాడే ఎర్రజెండా పక్షాన నిలిచి ప్రజలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొక్కొండ లింగయ్య గడ్డమీద నరసింహ తుటి వెంకటేశం దేవరకొండ రాజు నారం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.