త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతులు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గురువారం హైదరాబాద్ ఆయన స్వగృహంలో కలిసి తమ గోడును వెలబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధి నుండి విడిపోతున్న త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ని 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు మార్చాలని, నార్త్ సైడు వేసిన టెండర్ ప్రక్రియను ఆపాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి జై రామ్ రమేష్ నితిన్ గడ్కరికి లెటర్ రాయించాలని మనవి చేశారు. ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించి అతి త్వరలో తన సమక్షంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిబుల్ ఆర్ బాధిత రైతులని కల్పించి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి భూ నిర్వాసితుల బాధితులను ఆదుకుంటామని ఎంపీ అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు దబ్బేటి రాములు గౌడ్,మరుపాక లింగం గౌడ్,జాల వెంకటేష్ యాదవ్,బొమ్మిరెడ్డి ఉపేందర్ రెడ్డి,నాగవెల్లి దశరథ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.