నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అన్నారు. గురువారం బోనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో సీపీఐ(ఎం) పట్టణ కమిటీ, అర్బన్ కాలనీ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షలను ప్రారంభించి అనంతరం వారు మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన అర్బన్ కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పరిపాలించిన టిఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అర్బన్ కాలనీలో సమస్యలు తిష్ట వేసుకొని కూర్చున్న కనీసం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు గానీ అర్బన్ కాలిని అభివృద్ధి విషయంలో నోరు తెరిచే పరిస్థితి లేదని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలలో ప్రజా సమస్యలు పరిష్కారం మాట పక్కకు పెడితే నూతన సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని ప్రజాపాలనను ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదని వారు అన్నారు. అర్బన్ కాలనీలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అండర్పాస్ రోడ్డును నిర్మించాలని, ఒకటవ వార్డులో ఫేస్ టూ లో వాటర్ ట్యాంక్ మరియు వాటర్ పైప్లైన్ ఇంటింటికి నల్ల సౌకర్యం కల్పించాలన్నారు. స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని, అర్బన్ కాలనీ నుండి పోచమ్మ టెంపుల్ మీదుగా ముత్తిరెడ్డిగూడెం వెళ్లే మార్గంలో బీటీ రోడ్డు నిర్మించాలని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్లు మంజూరు చేయాలని అర్హుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదని వారు సూచించారు. వీరితోపాటు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, భువనగిరి మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, పట్టణ కార్యదర్శవర్గ సభ్యులు గంధమల్ల మాతయ్య, వనం రాజు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చింతల శివ, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, ఈర్ల రాహుల్, దీక్షలలో ఎస్ కే రియాజ్, ఎండి సాజిద్, ఎండి సోహెల్, ఎండి నిహాల్, హరీష్ కుమార్, జావేద్, ఫయాజ్, దీక్షలలో కూర్చోవడం జరిగింది సంఘీభావంగా రోటరీ క్లబ్ జిల్లా డైరెక్టర్ ఎండి హమిద్ పాషా, నిరంజన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.