అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ ను గెలిపించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ – చండూరు 
అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి. జహంగీర్ ను గెలిపించాలని, మే డే స్ఫూర్తితో కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా చండూరు మండల పరిధిలోని, చండూరు మున్సిపాలిటీ,నేర్మటలో సీపీఐ(ఎం) జెండాను, చండూరు మున్సిపాలిటీ లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్ పని ప్రదేశాలలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం జరుగుతున్న పోరాటం పై యాజమాన్యాల దాడికి బలైన అమరుల రక్తంలో నుండి పుట్టిన ఎర్రజెండా అనేక ఉద్యమాలు నిర్వహించి కార్మిక హక్కులు సాధించినది అని అన్నారు. కార్మికుల శ్రమశక్తి ద్వారా సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు శక్తులకు తాకట్టు పెడుతున్న బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపడానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాల్సిందని అన్నారు. కార్మిక చట్టాల మార్పులు 8 గంటల పని విధానాన్ని తీసివేసి పన్నెండు గంటలు పని విధానాన్ని ప్రవేశపెట్టాలని చూడడం అన్యాయమని అన్నారు. అంబానీ ఆదానీలకు ఆస్తులు కట్టబెడుతూ పేదలను కార్మికులను అణిచి వేస్తున్నారని అన్నారు విద్యుత్ సంస్కరణలు రైతు వ్యతిరేక విధానాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం సంవత్సరం పాటు పోరాడిన సందర్భంలో చట్టాలను రద్దు పరుస్తున్నామని హామీ ఇచ్చి దొంగ చాటుగా అమలు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మే డే స్ఫూర్తితో కార్మిక కర్షక ఐక్యతతో ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, సీఐటీయూ చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు  పాశం లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అన్నేపర్తి చిన్నవెంకన్న, ఉపాధ్యక్షులు నల్లగంటి లింగస్వామి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు నాంపల్లి శంకర్, ఉపాధ్యక్షులు నాగిల్ల లక్ష్మయ్య, బేర బిక్షమయ్య, దాసరి కృష్ణయ్య, భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.