
ఉమ్మడి మద్నూర్ మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలోని ఏనాబోరా గ్రామంలో గురువారం నాడు అల్లాహుల్లి కుటుంబంలో జరిగిన ముస్లిం సోదరుని పెండ్లి శుభ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ ప్రస్తుతం జరిగిన పార్లమెంట్ ఎన్నిక బీజేపీ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ హాజరయ్యారు ముస్లిం సోదరుని పెళ్లికి హాజరైన బీబీ పాటిల్ కు అల్లా ఒలి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బీబీ పాటిల్ తో పాటు కుటుంబీకులు డోంగ్లి సింగల్ విండో చైర్మన్ రామ్ పటేల్ బిజెపి పార్టీ యువ నాయకులు అక్షయ్ పటేల్ అలాగే బీజేపీకి చెందిన ఆ మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.