బిబిపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలు బుధవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీబీపేట మండల కేంద్రంలో కళాశాల నైతే ఏర్పాటు చేశారు. అక్కడ లెక్చర్లను పెట్టడం మర్చిపోయారన్నారు. వచ్చిన లెక్చలర్రు తమకు సరిగా విద్యను బోధించకపోవడంతో ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ఒకరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయామన్నారు. కళాశాల ప్రారంభమై ఎన్ని రోజులు గడుస్తున్న ఇప్పటికే ఒక లెక్చరర్ కూడా కాలేజ్ వైపు రాలేదని, ప్రభుత్వం కళాశాలను పట్టించుకోవడం లేదన్నారు. తమను లెక్చరర్లు వచ్చేవరకు దోమకొండ కళాశాలకు వెళ్లి చదువుకోమంటున్నారని అలా చదువుకోవడం తమకు ఇష్టం లేదని తమ పేరు ఏ కళాశాల రిజిస్ట్రేషన్ అవుతుందో ఆకాశాలలోనే చదువుకుంటామన్నారు. కావున కలెక్టర్ స్పందించి తమకు బిబిపేట కళాశాల నుంచి టీసీలు ఇప్పిస్తే తాము తమకు నచ్చిన కళాశాలలో చదువుకుంటామన్నారు. గత నెల రోజుల క్రితం కలెక్టర్ దగ్గరికి వచ్చామని త్వరలో లెక్చర్లను ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు అన్నారు. మళ్లీ తాము ద్వితీయ సంవత్సరంలో కూడా ఫెయిల్ అయితే తమ సంవత్సరం చదువు వృధా అవుతుందని, అలాకాకుండా ఉండాలంటే తమ టీసీలు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ విషయంపై జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం వివరణ కోరగా..దోమకొండ కు వెళ్లి చదువుకోమనిచెప్పాము.( జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ) బీబీపేట కళాశాలకు లెక్చరర్ వచ్చేవరకు దోమకొండ జూనియర్ కళాశాలకు వెళ్లి చదువుకోమని విద్యార్థులకు చెప్పామని, ప్రస్తుతం దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి చదువుకుంటున్నారని త్వరలోనే బీబీపేటకు లెక్చర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.