ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

Bicyclists must wear helmets– అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు అవగాహన…
– అబిడ్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎల్ రవికుమార్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆదేశాల మేరకు అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ స్పెక్టర్  ఎల్ రవికుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు కలిగిన ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితు ల్లోనూ చేయకూడదని వాహనదారులకు సూచించారు. ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ మంచిది కాదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ నాయుడు, ఏఎస్ఐ గణేష్ సింగ్, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.