– చైనా మాంజా వాడకం నిషేదం
నవతెలంగాణ- కంఠేశ్వర్
ద్విచక్ర వాహనాదారులు తప్పక హెల్మెట్ ధరించాలి అని జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల అవగాహన కార్యక్రమంలో వక్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ ఇంచార్జీపోలీస్ కమీషనర్ సి.హెచ్. సిందూశర్మ, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు జాతీయ రోడ్డు భద్రతా మాహోత్సవాలు- 2025 అవగాహన కార్యక్రమములో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఐ.ఎ.ఎస్, జిల్లా జడ్జి సునితా కుంచాల, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) జి.బస్వారెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్టు కమీషనర్ దుర్గా ప్రమీల, ఆర్.టి.ఓ జె. ఉమామహేశ్వరరావు హాజరై జండా ఊపి ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ద్విచక్ర వాహనాదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా హెల్మేట్ ధరించకుండా వాహనాలు నడిపిన త్రిబల్ రైడింగ్ చేసిన వాహనాదారులు వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించకపోయిన వారి పై మోటారు వెహికిల్ చట్టం క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్ ధరిండం వలన తమప్రాణాలను కాపాడుకున్నవారు అవుతారని, దాని వలన తమ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని, హెల్మెటు ధరించలేని సమయంలో ప్రమాద వశత్తుగా ఏదైనా ప్రమాదానికి గురి అయి అట్టి ప్రమాదంలో గాయాల పాలు కావచ్చు. లేదా ప్రమాదంలో మృతి చెందితే అట్టి కుటుంబాన్ని కన్నీటి పాలు చేసే పరిస్థితి వస్తుందని, కావున ప్రతిఒక్కరు హెల్మెటు ధరించి తమ ప్రాణాలను కాపాడుకొవడమే కాకుండా తన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకున్నవారు అవుతారని తెలిపారు. ప్రజలరక్షణకోసం అన్నిచర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు వాహనాదారులు తప్పక వాహనానికి సంబంధించిన కాగితాలు తమవద్ద ఉంచుకోవాలని, ట్రాఫిక్ రుల్స్ తప్పక పాటించాలని అన్నారు.
ప్రతి ఒక్కరు హెల్మెట్ దరించాలని, వాహనాలను అతి వేగంగా నడవపద్దని, త్రిబల్ రైడింగ్ చేయరాదని తెలియజేశారు. చైనా మాంజా ఎవ్వరయిన నిలువ ఉంచిన, ఎవ్వరయిన తయారుచేసిన. ఎవ్వరయిన అమ్మిన, అమ్మడానికి ఎవ్వరయిన ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడును. ఎవ్వరయిన బయట పడేసినట్లయితే ప్రజలకు మరియు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. విక్రయించిన మాంజా తో ఎదైనా ప్రమాదం జరిగినట్లయితే విక్రయ దారులు కూడా అట్టి కేసుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎవ్వరయిన సూచనలకు విరుద్ధంగా ఎవ్వరయిన చైనా మంజా నిలువచేసిన, అమ్మిన వారిపై చట్ట ప్రకారం చర్యలు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాదారులు తప్పకుండా హెల్మేటు ధరించాలని, ప్రజలందరూ తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని, ఈ నెల రోజులలో ఈ మాహోసోత్సవా లను అందరము విజయవంతం చేయాలని, ప్రజల ప్రాణాలను కాపాడటానికి అందరము ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగాకృషి చేయాలని అన్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా చైనా మాంజా వాడకూడదూ అని ఎవ్వరైనా చైనా మాంజా వాడినట్లయితే వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 1 లక్ష రూపాయల వరకు జరిమాన గలదు అన్నారు. ఈ సందర్భంగా ప్ల కార్డుల ద్వారా ప్రదర్శించి, తదువరి హెల్మేట్లు ధరించిన వారికి గులాబి పువ్వూలు ఇచ్చి అభినందించారు. హెల్మెటు ధరించని వారికి కొత్త హెల్మెట్లు ఇచ్చి హెల్మేటు తప్పకుండా ధరించాలని సూచనలు ఇచ్చారు. అనంతరం ద్విచక్ర వాహనాల ర్యాలీ ఎన్.టి.ఆర్ చౌరస్తా నుండి ప్రారంభం అయి కోర్టు చౌరస్తా ,గ్లామర్ హోటల్, తిలక్ గార్డెన్, ప్రభుత్వ హాస్పటల్, దేవి రోడ్డు, నెహ్రూ పార్కు, ఆర్.టి.సి బస్టాండ్, రైల్వే స్టేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్కు చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్డి ఖుష్బు ఉపాద్యాయా, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్డి గోపిక్రిష్ణ ,ఆర్మూర్, బోధన్ ఎమ్.వి.ఐలు జి. వివేకనంద రెడ్డి కె. అజయ్ కుమార్ నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట రెడ్డి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, నిజామాబాద్ డివిజన్ సి.ఐ లు, ఎస్.ఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్స్ సతీష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి, ట్రాఫిక్ ఎస్.ఐలు చంద్రమోహన్ రహమత్ ఉల్లా, ఆర్.ఎస్.ఐలు బి.సుమన్, దాదాపు 300 ద్విచక్ర వాహానాదారులు (ట్రాఫిక్ సిబ్బంది, ఎ.ఆర్ సిబ్బంది, సివిల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, మహిళా సిబ్బంది, హోమ్ గార్డ్స్ సిబ్బంది ) పాల్గొన్నారు.