సభా హక్కుల కమిటీకి బిదూరీ వివాదం

న్యూఢిల్లీ : బిఎస్‌పి ఎంపి డానిష్‌ అలీని అసభ్యకరంగా, అభ్యంతరకరమైన మాటలతో దూషించిన బిజెపి ఎంపి రమేష్‌ బిదూరీపై పార్లమెంట్‌ సభ్యులు చేసిన ఫిర్యాదులను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభా హక్కుల కమిటీకి నివేదించారని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. బిదూరీపై చర్యలు తీసుకోవాలంటూ అలీ, అదిర్‌ రంజన్‌ చౌదరి, కనిమొళిలతో సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. కాగా బిదూరీని రెచ్చగొట్టేలా అలీ మాట్లాడారని, స్పీకర్‌ ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని నిషికాంత్‌ దూబే, ఇతర బిజెపి ఎంపిలు కోరారు.