పల్లె ప్రగతితో పెను మార్పులు..

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ 
పల్లె ప్రగతితో గ్రామాల్లో పెను మార్పులు వచ్చాయని, ఈకార్యక్రమంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుతుందని పద్మనాభునిపల్లి గ్రామ సర్పంచ్ కండ్లకొయ పర్షరాములు అన్నారు.సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభుని పల్లి గ్రామంలో గురువారం పల్లె ప్రగతి దినోత్సవం సర్పంచ్ కండ్లకోయ పరుశరాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో భాస్కర శర్మ, తిమ్మాపూర్ ఎంపీటీసీ రామవరం మాధవి చంద్రశేఖర్ రెడ్డి హజరు కాగా…. సర్పంచ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సాధించుకున్న ప్రగతిని సర్పంచ్  గ్రామస్తులకు వివరించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాకే గ్రామీణ ప్రాంతాలు మెరుగుపడుతున్నాయని, ప్రభుత్వం ప్రవేశపెట్టి పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారాయని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి ఆచరణలో కూడా నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ కాల్వల రైతులకు సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తూ సీఎం కేసీఆర్ అందరి బంధువుడు అయ్యాడు అన్నారు. తమ గ్రామానికి పల్లె ప్రగతి కార్యక్రమంతో జిల్లాలో ఉత్తమగ్రామ పంచాయతీ అవార్డును జిల్లా స్థాయిలో సాధించుకున్నామన్నారు. పల్లె ప్రగతిలో అవార్డ్ రావడానికి గ్రామస్తులు, పాలకవర్గం, అధికారుల కృషి, ప్రోత్సహకాలు ఉన్నాయని అన్నారు. అనంతరం ఎంపీటీసీ మాధవి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపిడిఓ భాస్కర శర్మ మాట్లాడుతూ సీఎం కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే ప్రవేశపెట్టిన పథకాలను గ్రామీణ ప్రాంతాలు సద్వినియోగం చేసుకొని అన్నింట అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పల్లె ప్రకృతి వనం, మంకీ ఫుడ్ కోర్ట్, వైకుంఠధామం, నర్సరీ, డంప్ యార్డ్ పనులతోపాటు రొడ్లకి ఇరువైపులా చెట్లు నాటి మండలంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలుస్తూ… ఎన్ఆర్ఈజీఎస్ పథకంతో పాటు , ప్రభుత్వ నిధులతో 70లక్షల నిధులతో మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అధునాతన హంగులతో గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేసుకుని మండలంలోనే మొదటగా మన ఊరు మనబడి ద్వారా ఈ పాఠశాలను ప్రారంభం చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. అనంతరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఉత్తమ సేవ పత్రాలను గ్రామ పంచాయతీ కార్మికులైన ముక్కపల్లి శ్రీకాంత్, బాబాయ్, మనెమ్మలకు ఉత్తమ సేవా ప్రగతి అవార్డులు అందజేసి శాలువాతో వారిని సర్పంచ్ , ఎంపిడివో, పాలక వర్గ సభ్యులు సత్కరించి అభినందించారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు విజయ భాస్కర్, స్వరూప, మల్లయ్య, రాములు, కనకవ్వ, లక్ష్మీ, అంగన్వాడీ టీచర్ లావణ్య, ఏఎన్ఎం పుష్పలత, వివో గౌతమి, ఆశ సుభద్ర, తదితరులు ఉన్నారు.