ఉప్లూర్ లో పెద్ద పోచమ్మ పండుగ

Big Pochamma festival in Uplurనవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని ఉప్లూర్ లో ఆదివారం స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద పోచమ్మ (ఊర పండుగ) పండుగను ఘనంగా నిర్వహించారు.పెద్ద పోచమ్మ నూతన ఆలయం, నూతనంగా తయారు చేయించిన  పెద్ద పోచమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున గ్రామంలో పోచమ్మ పండుగను నిర్వహించారు. గ్రామం నుండి పెద్ద పోచమ్మ నూతన ఆలయం వరకు  ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో పట్నం వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.ఊరేగింపు సందర్భంగా పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.అనంతరం పెద్ద పోచమ్మ నూతన ఆలయంలో నూతన విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక మొదటి పద్మశాలి సంఘం సభ్యులు అమ్మవారికి చీర, ఒడిబియ్యం నైవేద్యం సమర్పించారు. గ్రామ దేవతలైన సార్గమ్మ, మహాలక్ష్మి దేవి, పెద్దమ్మ తల్లి, ఐదు చేతుల పోషవ్వకు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సోమ దశరథ్, సభ్యులు బద్దం రమేష్ రెడ్డి, కొమ్ముల రవీందర్, సుంకరి విజయ్ కుమార్, అశ్వపతి, ఇతర సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.