బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

– కారు దిగనున్న మంత్రి అనుచరులు
– కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం సిద్ధం
– బీఆర్‌ఎస్‌లో ముదిరిన ముసలం
– 13నవికారాబాద్‌లో భారీ బహిరంగ సభ
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌లో ముసలం మరింత ముదిరింది. అసమ్మతి నాయకులుగా ముద్రపడ్డ వారంతా ఒక్కొక్కరుగా పార్టీ వదిలి పక్కదారి పట్టారు. మరికొందరు పార్టీలోనే తటస్థం గా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది మరింత ముదిరి పార్టీకి నష్టం జరిగే స్థాయికి చేరింది. అసమ్మతి నాయకులను దారిలో పెట్టడానికి అగ్రనేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది. పార్టీలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించాలని ప్రత్యర్థి అభ్యర్థిగా భావించి ఓడిం చడమే లక్ష్యంగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర సమాచార పౌర సంబంధాల భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి ముఖ్యఅనుచరులుగా భావి స్తున్న వికారాబాద్‌ గ్రంథాలయ మాజీ చైర్మన్‌ ఎన్‌ కొండల్‌ రెడ్డితోపాటు మోమిన్‌పేట వికారాబాద్‌ మర్పల్లి, ధరూర్‌ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు త్వరలోనే బీఆర్‌ ఎస్‌ను వదలనున్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 13న వికారాబాద్‌ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరి నాయకుల కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌ రెడ్డి హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. దీని కోసం ఈనెల 13న ముహూర్తం ఖరారు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి డీసీబీ చైర్మన్‌ మనోహర్‌ రెడ్డి కూడా బీర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. చిన్నోల్ల కీచులాట బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తో కొంతకాలంగా మాజీ గ్రంథాలయ చైర్మన్‌ కొండల్‌ రెడ్డి తోపాటు మోమిన్‌పేట, మర్పల్లి, ధరూర్‌, వికారాబాద్‌, మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో వైరం ఉంది వారంతా బీఆర్‌ఎస్‌లో ఉంటూ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ కు వ్యతిరేకంగా పనిచేశారు వీరంతా మంత్రి మహేందర్‌ రెడి,్డ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ సునీత మహేందర్‌ రెడ్డి అ నుచరులుగా ముద్ర పడింది. మర్పల్లి మండలంలోని పట్లూరులో సునీత మహేందర్‌ రెడ్డి కాన్వారు పై ఎమ్మెల్యే ఆనంద్‌ తన అనుచరులతో దాడి చేయించారని విషయమై మంత్రి మహేందర్‌ రెడ్డి ఎమ్మెల్యే ఆనంద్‌ మధ్య అగాధం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్‌ ఎస్‌ అధిష్టాన వర్గం అసమ్మతి నాయకుల మధ్య స్నేహ పూర్వక వాతావరణంలో కల్పించడానికి అనేక దఫాలుగా ఇరువురితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగానే మంత్రి మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌ మధ్య ఉన్న అగాధానికి తెర పడింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కలిసి పని చేయడానికి వీరంతా ఒక వేదికపై వచ్చారు. కానీ ఇప్పటివరకు వ్యతిరేకంగా ఉ న్న చోటా నాయకులు పెద్ద నాయకులతో కలిసి పని చేయడానికి ససేమీరా అంటున్నారు. వారు బీఆర్‌ఎస్‌లో ఇముడలేక పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి దా దాపు చోట మోట నాయకులు కలిసి దాదాపు 10 వేల మంది బీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచా రం జరుగుతుంది. అందులో భాగంగానే వికారాబాద్‌ మా జీ గ్రంథాలయ చైర్మన్‌ కొండల్‌ రెడ్డి గ్రౌండ్‌ వర్క్‌ ప్రారం భించారు. కాంగ్రెస్‌లో మోమిన్‌పేట నుంచి సీనియర్‌ నా యకులు నర్వత్తమ రెడ్డి తమ అనుచరులతో దారూర్‌ నుం చి హనుమంత్‌ రెడ్డి తమ అనుచరులతో వికారాబాద్‌ నుం చి చిగుళ్ళపల్లి రమేష్‌ మరి కొంతమంది నాయకులు కాం గ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల ముందు కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ మరింత బలపడుతుంది. బీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దీని పై అధిష్టానం వర్గం ఎలా ఫోకస్‌ చేస్తుందో వేచి చూడాల్సిందే.