– 30 మందిని పార్టీలోకి ఆహ్వానించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
– హరీష్ రావ్ రాజీనామా చేయాలనీ డిమాండ్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
దుబ్బాక మండల పరిధిలోని కమ్మరపల్లి గ్రామానికి చెందిన 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ మేరకు సీఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని , ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షలు రుణమాఫీ చేశారని అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ కి నిజంగా చిత్త శుద్ధి ఉంటే రాజీనామా చేసి తీరాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, ఉపాధ్యక్షుడు కడుదూరి నరేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మిద్దె ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీలు అనంతుల రాజు చర్లపల్లి బాల్రెడ్డి, మెట్ల సంజీవ్, పోతారం గ్రామ తాజా మాజీ సర్పంచులు గడీల జనార్దన్ రెడ్డి సంధిరి బాలకిషన్, సీనియర్ నాయకులు మట్ట కిషన్ రెడ్డి, టెలికాం బోర్డు మెంబర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్, మామిడిపల్లి కనకరాజు, మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.