పెద్దవంగరలో బీఆర్ఎస్ కు భారీ షాక్

నవతెలంగాణ – పెద్దవంగర
పెద్దవంగరలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. మండల కేంద్రంలోని ఎస్సీ, యాదవ, ముదిరాజ్ కులస్తులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పాలకుర్తి కాంగ్రెస్ నియోజకవర్గ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లిని ఓడించడానికి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి, పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చామని, యశస్విని రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు కోరారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని, పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, మండల ఇంచార్జీ విజయ్ పాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పూర్ణచందర్, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, యూత్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, చిలుక సంపత్, సుంకరి అంజయ్య, ఐలయ్య, వెంకన్న, చెరుకు యాకయ్య, వెంకన్న, సోమయ్య తదితరులు పాల్గొన్నారు