ఫ్యామిలీ స్టార్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌

ఫ్యామిలీ స్టార్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఆదరణతో సక్సెస్‌ ఫుల్‌ థియేట్రికల్‌ రన్‌ కంటిన్యూ చేస్తోంది విజరు దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా. తమ ఫ్యామిలీకి సపోర్ట్‌గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్‌. అలాంటి ఫ్యామిలీ స్టార్స్‌ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్‌ టీమ్‌ సర్‌ప్రైజ్‌ విజిటింగ్‌కు వస్తోంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్‌ను ఫ్యామిలీ స్టార్‌ టీమ్‌ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు గొప్ప అవకాశం ఇది. ఈ అనౌన్స్‌మెంట్‌లోని ఫామ్‌ ఫిల్‌ చేస్తే ఫ్యామిలీ స్టార్‌ టీమ్‌ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్‌ రాజు, హీరోయిన్‌ మణాల్‌ ఠాకూర్‌, దర్శకుడు పరశురామ్‌ పెట్ల మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఈ ఫామ్‌లో మీ పేరు అడ్రస్‌తో పాటు మీ ఫ్యామిలీ స్టార్‌ ఎవరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్‌ రాసి ఫిల్‌ చేయాలి. థియేటర్స్‌లోకి వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌కు వచ్చింది ఫ్యామిలీ స్టార్‌ సినిమా. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు సహా ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెటెడ్‌ ఆడియెన్స్‌ అయిన సకుటుంబ ప్రేక్షకులకు బాగా రీచ్‌ అవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజరు దేవరకొండకు పేరు రాకూడదని కొందరు వ్యక్తులు, కొన్ని సోషల్‌ మీడియా గ్రూప్స్‌ పనిగట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. రిలీజ్‌కు ముందే సినిమా మీద నెగిటివ్‌ పోస్టులు చేశారు. వీటిని ఆధారాలతో సహా చిత్ర బృందం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.