బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య సమస్య అనంతరం కోలుకుంటున్న నాగం జనార్ధన్ రెడ్డి ని పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పలువురు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.