నవతెలంగాణ-తాడ్వాయి : మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను ఆదివారం సరిహద్దు రాష్ట్రమైన చతిస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామ్ కోటి, అక్కడి వైద్య సిబ్బందితో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఆదివాసీ సంప్రదాయ ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. పూజార్లు ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి అమ్మ వారి ప్రసాదం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారంలోని వనదేవతలను దర్శించుకోవడం మహాభాగ్యంగా గర్విస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ గొంది సత్యనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ పి కే సాహు, హనుమకొండ బ్రాంచ్ ఎల్ఐసి అసిస్టెంట్ మేనేజర్ చేల సత్యం తదితరులు పాల్గొన్నారు.