నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని బిజ్జల్ వాడి మరియు కత్తల్ వాడి గ్రామ పంచాయతి గ్రామాలలో జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ మంగళ వారం నాడు సందర్శించారు. ఈ సంధర్భంగా పలు గ్రామా పంచాయతిలలోని హరితహరం, నర్సరీలు, నీటీ సమస్యలు పరిష్కరించడం, గ్రామ పరిశుభ్రత, వందశాతం పన్నుల వసూళ్లు, ప్రభూత్వ పాఠశాలలు, డంపింగ్ యార్డ్ ల నిర్వహణ, చెత్త సేకరణ, తో పాటు రికార్డుల నిర్వహణ చేపట్టాలని పంచాయతి కార్యదర్శిలు దివ్వ బిజ్జల్ వాడీ జీపీ, రాజ్ కూమార్ కత్తల్ వాడీ జీపీ ల అధికారులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమయపాలన పాటీంచి గ్రామాల ఆభివృద్దిలో సెక్రట్రిల సహకారం కనబడాలని వివరించారు. అనంతరం బిజ్జల్ వాడి ఎంపిపీఎస్ పాఠశాల ను సందర్శించారు. హెచ్ఎం ఇంగు భారతీ బాయి ని మద్యహన బోజనం, విద్యర్థుల హజరు సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. జీపీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ గౌళే యాదవ్ ఆధ్వర్యంలో మెుదటి సారిగా గ్రామానికి వచ్చిన ఎంపిడీవో శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రెండు గ్రామాల మాజీ సర్పంచులు , సెక్రట్రిలు దివ్య, రాజ్ కూమార్, ఎంపిపీఎస్ హెచ్ఎం తదితరులు పాల్గోన్నారు.