తూప్రాన్ పేట్ జాతీయ రహదారిపై బైక్ దగ్ధం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బైక్ దగ్ధమైంది.గురువారం విజయవాడ నుండి హైదరాబాద్ కు బైక్ పై వెళుతున్న ప్రయాణికుడు తూప్రాన్ పేట వద్ద లారీ కంటైనర్ ను ఓవర్ టేక్ చేయడంతో బైక్ లారీ కు తగలడంతో మంటలు రావడంతో బైకు దగ్ధమైంది. బైక్ పై వెళుతున్న వ్యక్తికి గాయాలు కావడంతో పోలీసులు చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తూప్రాన్ పేట వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు లేకపోవడంతో, సిగ్నల్స్ స్టాప్లు లేకపోవడంతో ఇక్కడ తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికి దాదాపు ఈ రోడ్డుపై వద్ద వందల రోడ్డు ప్రమాదాలు జరిగి ఉంటాయని ఎందరో మంది చనిపోయి ఉంటారని గ్రామస్తులు ఊపిరిని గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇక్కడ రోడ్డు దాటి అవతలికి పోవాలంటే ప్రాణాన్ని అరచేతిలో అడ్డం పెట్టుకొని రోడ్డు దాటావలసి వస్తున్నది. ప్రభుత్వం గానీ జిఎంఆర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టి వెంటనే ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని తూప్రాన్ పేట గ్రామ ప్రజలు కోరుతున్నారు.