
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టాడాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, భీంగల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేతంగా ఒక్కొక్కటిగా సరిద్దిద్దుకుంటూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫికి శ్రీకారం చుట్టి, మొదటి విడతలో రూ. లక్ష వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశారన్నారు.రైతులకు రెండు లక్షల రుణమాఫి ఇప్పటివరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల గుండెల్లో చిరకాలం నిలిచి పోతుందని అన్నారు. రైతును రాజును చేయాలన్న దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో వ్యవసాయం దండగ కాదు పండగ అనే పరిస్థితి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఎన్నికల్లో ఇచ్చినా మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు.ఆగష్టు 15 లోపు అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫి జరుగుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణ విముక్తిలను చెయడమే కాకుండా రానున్న రోజుల్లో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తుంది అన్నారు. అనంతరం భీంగల్ పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సన్మాన కార్యక్రమానికి తరలి వెళ్లారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలెపు నరసయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, నాయకులు బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, ఉట్నూరి ప్రదీప్, పూజారి శేఖర్, వేములవాడ జగదీష్, సల్లూరి గణేష్ గౌడ్, నాగపూర్ అశోక్, మైసల అర్జున్, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.