హుస్నాబాద్ లో మెకానిక్ ల బైక్ ర్యాలీ

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా సోమవారం హుస్నాబాద్ పట్టణం లో టూ వీలర్ మెకానిక్ లు బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుండి డిపో క్రాసింగ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు ఉప్పుల వెంకట్, కర్ణకంటి నరేష్,శివ సాయి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.