బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ

Bike rally with national flags under the leadership of BJPనవతెలంగాణ – రామకృష్ణాపూర్
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  పిలుపుమేరకు బీజేపీ పట్టణ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు సంతోష్ రామ్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివార జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు.స్థానిక సూపర్ బజార్ లోని బీజేపీ కార్యాలయంలో ర్యాలీ ప్రారంభమై  ఠాగూర్ స్టేడియం, విద్యానగర్ రాజీవ్ చౌక్ మీదుగా బిజోన్ సెంటర్ నవ భారతి కాలనీ అంగడి బజార్ రామాలయం ఏ జోన్ సూపర్ బజార్లో బైకు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ లో పట్టణ పుర ప్రముఖులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర సమరయోధుల  స్మారక  చిహ్నాలు, పేర్లు తలుచుకుంటూ బైక్ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వేముల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముశ్ల పోశం, హర్ ఘర్ తిరంగా పట్టణ కన్వీనర్ కట్ట ఈశ్వర చారి,కో కన్వీనర్ మాసు సత్యనారాయణ, 11వ వార్డు కౌన్సిలర్ గడ్డం సంపత్ , బీజేపీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.