షార్ట్ సర్క్యూట్ తో బైక్ సర్వీసింగ్ పాయింట్ దగ్ధం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బైక్ సర్వీసింగ్ పాయింట్ మంగళవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన భద్రబోయిన జగన్,కొండూరు రాజు శ్రీ సిద్ధి వినాయక బైక్ సర్వీసింగ్ పాయింట్ ను ఇద్దరు కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రం తంగడపల్లి రోడ్డులో 4 సంవత్సరాల నుంచి సర్వీసింగ్ పాయింట్ ను నడుపుతున్నారు.మంగళవారం రోజు పని ముగించుకొని రాత్రి 9:30 గంటలకు ఇంటికి వెళ్లిపోయారు.రాత్రి 1.00 గంటల సమయంలో షాపులో నుండి పొగలు వెళుతున్నాయని పక్కన ఇంటి యజమాని ఫోన్ చేయడంతో హుటాహుటిన జనగాం నుండి చౌటుప్పల్ షాపు వద్దకు చేరుకున్నా రు.మార్గ మధ్యలోనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్లో ఫిర్యాదు చేయడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పారు.సర్వీసింగ్ కోసం షాప్ లో ఉన్న 6 బైకులు, వాటర్ సర్వీసింగ్ మోటర్,టూల్ కిట్లు,ఆయిల్ డ్రమ్ములు తగలబడి బూడిద అయిపోయాయి. అప్పటికే జరగరాని నష్టం జరిగిందని.వీటి నష్టం విలువ 5-6 లక్షల వరకు ఉంటుందని షాపుల బైక్ మెకానిక్ లు జగన్,రాజు లబోదిబోమని ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.