నవతెలంగాణ – చందుర్తి
మూడపల్లి వెంకటేశ్వర ఆలయం వద్ద ఆదివారం ద్విచక్ర వాహనం ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్రిగడ్డ గ్రామానికి చెందిన నేతి కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి ఆలయం దర్శనానికి వచ్చాడు. తన ద్వి చక్ర వాహనం ఆలయం ముందు నిలిపి దర్శనం చేసుకొని వచ్చే సరికి బైక్ కనపడక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సిసి కెమెరాలు పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి ఎపి 25ఏజె 2546 అనే నంబర్ గల పాత ద్వి చక్ర వాహనం పై వచ్చి తెచ్చుకున్న బైక్ ను అక్కడినే వదిలి శ్రీనివాస్ అనే వ్యక్తి ది కొత్త ఫ్యాషన్ ప్రో తీసుకొని వెళ్లినట్లుగా సిసి ఫుటేజ్ లో చూసినట్ల గా తెలిపారు. వదిలి పెట్టిన ద్వి చక్ర వాహనం కూడా దొంగిలించిందేనని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు.