పోలీస్ స్టేషన్ ముందు నుండి బైక్ చోరి..

నవీపేట్:– ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చి చోరీకి గురైన బైక్
నవ తెలంగాణ- నవీపేట్: తన ఇంట్లో జరిగిన చోరీ విషయమై పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చి మోటార్ బైక్ పోగొట్టుకున్న సంఘటన నవీపేట్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం తన ఇంట్లో గురువారం రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు  చొరబడి పర్సులోని 7500 దొంగలించారు. వెంటనే తేరుకున్న మల్లేష్ ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఫిర్యాదు ఇచ్చేందుకు శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు స్ప్లెండర్ ప్లస్ బైక్( Ap25L 9537)తీసుకొని వెళ్లి పార్కింగ్ ప్రదేశంలో ఆపి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాడు. అరగంటసేపు ఆగి బయటకు రాగా మోటార్ బైక్ లేకపోవడంతో కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన సీసీ కెమెరా ఉన్న ఫలితం లేదని బాధితుడు వాపోతున్నాడు. పోలీస్ స్టేషన్ ముందే దొంగతనాలు జరిగితే గ్రామాల్లో పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నించుకుంటున్నారు.