సాటాపూర్ సంతలో బైక్ దొంగతనం..

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం సాటాపూర్ సంతలో గుర్తు తెలియని వ్యక్తి ( టీవీఎస్ ఎక్సెల్) ను దొంగిలించినట్లు బాధితుడు నాగారావ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నీలా గ్రామానికి చెందిన నాగారావు మార్కెట్లో తన బైక్ ను లాక్ చేసి సరుకులు కొనుగోలు చేసుకొని బైక్ వద్దకు రాగా తన బైకు దొంగిలించబడిందని ఆయన పేర్కొన్నారు. బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభోత్సవానికి రాగా, బీసీ సెల్ మండల అధ్యక్షులు గోసుల గంగా కిషన్ బైక్ ను పాఠశాల ముందు లాక్ చేసి ఉన్నప్పటికీ దానిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఇటీవల బైకు దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజల్లో బయందోళన రేకెత్తిస్తున్నాయి. నీల గ్రామంలో మరొక బైకు దొంగతనానికి గురైనట్లు తెలిసింది. బైకు దొంగలపై ప్రత్యేక దృష్టిని సారించి అదుపులోకి తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.