నవతెలంగాణ – కామారెడ్డి
ఈ నేల 6వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి ప్రారంభమయ్యే బైక్ యాత్ర ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుసేగం భూమయ్య పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6వ తేదీన జరుగు బైకు ర్యాలీని జయప్రదం చేయడానికి మాదిగ, మాదిగ ఉపకులాలు కలిసి రావాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి ప్రారంభమై అన్ని మండల మీదుగా డిసెంబర్ నెల మొత్తం వరకు కొనసాగే బైక్ యాత్రను మాదిగ జాతి ఉపకులాలు చెత్యాన్యకోసం 59 ఉప కులాలు జనాబా నిస్పతి ప్రకారం ప్రతి గ్రామ గ్రామం నుండి జాతిని మేలుకొలుపుతూ యాత్రను విజయవంతం చేయుటకు అందరూ ఉపకులంతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పైన 10 డిమాండ్లను పెడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని, వర్గీకరణ జరగకుండా ఉద్యోగ నియమకాలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వనికి డిమాండ్ చేశారు. ఎన్నికలలో చెప్పిన మాట ప్రకారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షలు రూపాయలు వెంటనే అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు పేరున ఇస్తున్న ఇండ్లను అర్హులైన నిరుపేదలకు లబ్ధిదారులకే ఇవ్వాలని, రాష్ట్రంలోని డప్పులు కొట్టేవారు, చెప్పులు కుట్టే వారికి 6వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని, అసైన్డ్ మెంట్ భూములను పట్టలుగా మార్చి ఇవ్వలని, భూమి లేని వారిని గుర్తించి భూ పంపిణీ చేయాలని, పోడు భూములు ఎస్టీల కే కాకుండా ఎస్సీలకు కూడా వర్తించే విధంగా చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రైవేట్ రంగంలోఎస్సీలకు రిజర్వేషన్ కల్పించి, మాదిగలకు ప్రాధాన్యత కల్పించాలని, ఈ యొక్క డిమాండ్లు నెరవేర్చింతవరకు కార్యక్రమాలు ప్రతి మండల ప్రతి గ్రామాల వరకు చేరే విధంగా ప్రతి మాదిగ, మాదిగ 59 ఉప కులాలు విజయవంతం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో భూమయ్య మాదిగ, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.